మాదాపూర్, సెప్టెంబర్ 28 (నమస్తే శేరిలింగంపల్లి): శిల్పారామం మాదాపూర్ లో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శ్రీ నృత్య అకాడమీ గురువు ప్రత్యుష శిష్య బృందంచే కూచిపూడి నృత్య ప్రదర్శన నిర్వహించగా ఎంతగానో అలరించింది. వినాయక కౌతం, స్వరపల్లవి, జతిస్వరం, ముద్దుగార యశోద, ఇందరికి అభయము ఇచ్చు చేయి, రామాయణ శబ్దం, గణపతి కీర్తన, శ్రీ రామ సరస్వతి, భజమానస మొదలైన అంశాలను ప్రత్యుష, స్ఫూర్తి, సహస్ర, సాత్విక, సాన్విక, అక్షిత, హాసిని, హిమశ్రీ, సుజిత తదితరులు ప్రదర్శించి మెప్పించారు.
ఈ సందర్భంగా కూచిపూడి నృత్య కళ ప్రదర్శనకు అవని స్వచ్చంద సంస్థ వ్యవస్థాపకురాలు శిరీష సత్తూర్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కూచిపూడి కళాకారిణిలకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూచిపూడి, భరతనాట్యం శాస్త్రీయ నృత్యాలలో ఆసక్తి కలిగిన కళాకారులకు తమ వంతు చేయూత ఎల్లప్పుడూ ఉంటుందని ఆమె పేర్కొన్నారు.