నమస్తే శేరిలింగంపల్లి : తెలంగాణ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల అభ్యర్థులు తమ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపారు. తమతోటి మిత్రులకు సమయం వెచ్చించి పార్కుల వద్ద, తమ ఇంటివద్ద ఆనందంగా సేద దీరారు. తమ తమ కార్యాలయాల్లో పోలింగ్ పరిశీలన విశ్లేషనలో నిమగ్నమయ్యారు.
ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో… శేరిలింగంపల్లి నియోజకవర్గ బిఆర్ఎస్ అభ్యర్థి ఆరెకపూడి గాంధీ తన కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడిపారు. తన కుటుంబ పరివారంతో టివి చూస్తుండగా తీసిన చిత్రమిది.