- కిడ్జీ ప్రీ స్కూల్ ను ప్రారంభించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్
నమస్తే శేరిలింగంపల్లి : గచ్చిబౌలి డివిజన్ నలగండ్లలో నూతనంగా ఏర్పాటు చేసిన కిడ్జీ ప్రీ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రవి, కావ్య దంపతుల ఆహ్వానం మేరకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇన్చార్జి రవికుమార్ యాదవ్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్కూల్ ఏర్పాటు చేసిన రవి, కావ్యలకు అభినందనలు తెలిపారు. పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తూ, విద్యతో పాటు సంస్కృతి, సంప్రదాయాలను, ఇప్పటి నుండే నేర్పించాలని కోరారు. పలు శాఖలను ఏర్పాటు చేయాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు గొల్ల నిరంజన్ యాదవ్, బిజెపి జిల్లా అధికార ప్రతినిధి చల్లా వేణుగోపాల్ యాదవ్, నల్లగండ్ల గూడ కాలనీ ప్రెసిడెంట్ జలంధర్, కాలనీ అసోసియేషన్ సభ్యులు, స్కూల్ యాజమాన్యం సిబ్బంది, తల్లిదండ్రులు పిల్లలు పాల్గొన్నారు.