- కాంగ్రెస్ పార్టీని విజయపథంలో ఉంచిన ప్రజలందరికీ ధన్యవాదాలు :
నమస్తే శేరిలింగంపల్లి : ఎన్నికలలో గెలుపోటములు సహజం, ప్రజాతీర్పును గౌరవిస్తామని, కాంగ్రెస్ పార్టీ పై తనపై నమ్మకం ఉంచి ఒక లక్ష 99 వేల 30 ఓట్లు వేసి పార్టీని ఆశీర్వదించిన శేరిలింగంపల్లి ప్రజానీకానికి ఎల్లవేళలా రుణపడి ఉంటానని కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి వి.జగదీశ్వర్ గౌడ్ తెలిపారు.
శేరిలింగంపల్లి ప్రజాలతోనే ఉంటాం, ప్రజాలకోసమే పని చేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అఖండ మెజారిటీ అందించినందుకు ధన్యవాదాలు తెలిపారు, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి నాయకత్వంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని అన్నారు.