రసవత్తరంగా రెనోవా ఎలెవన్ వర్సెస్ క్రికెట్ కాంకరర్స్ పోరు

  • అడుగు దూరంలో ఓటమి పాలైన క్రికెట్ కాంకరర్స్
  • 55 పరుగులు చేసి ప్రత్యర్థికి గట్టి పోటి ఇచ్చిన వంశీమోహన్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి : రెనోవా ఎలెవన్ వర్సెస్ క్రికెట్ కాంకరర్స్ మధ్య పోరు రసవత్తరంగా సాగింది. ఈ రెండు జట్ల మధ్య నాగోల్, ఫతుల్లాగూడ, బండ్లగూడలో పోటి జరిగింది. మొదట టాస్ గెలిచిన రెనోవా ఎలెవన్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది.

20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 136పరుగులు చేసింది. రెనోవా విధించిన టార్గెట్ ను చేధించేందుకు బరిలో దిగిన క్రికెట్ కాంకరర్స్ గట్టి పోటినిచ్చింది. ఓ వైపు వికెట్లు పడుతున్న జడవక నిలకడగా  ఆడుతూ.. సమయానుకూలంగా భారీ షాట్లు కొడుతూ ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ సి. వంశీమోహన్ రెడ్డి (46 బంతుల్లో 6 (4ఫోర్లు), 2(6సిక్సులు)లతో 55 పరుగులు చేశాడు.

ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ సి. వంశీమోహన్ రెడ్డి

దాదాపు ప్రత్యర్థిని ఓటమి అంచుకు తీసుకెళ్లాడు. తనకు ఎవరూ తోడు లేకపోవడంతో ఒంటరి పోరాటాన్ని కొనసాగించిన గెలుపు ఒక అడుగు దూరంలో నిలిచింది. 7 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసి ఓటమి పాలైంది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here