నమస్తే శేరిలింగంపల్లి: గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక మండలి ఎన్నికల ఫలితాలు దాదాపుగా వచ్చేసాయి. టిఆర్ఎస్ పార్టీ ఇప్పటి వరకు గెలిచిన సీట్లతో పాటు ఎక్స్ అఫిషియో సభ్యులతో కలిపి మ్యాజిక్ ఫిగర్ కు దరిదాపుల్లో ఉన్నారు. కాగా నూతన మేయర్ గా ఎవరు పదవీ బాధ్యతలు చేపట్టనున్నారని విషయం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే సంగారెడ్డి జిల్లా పరిధిలో గల భారతి నగర్ డివిజన్ 111 నుండి గెలుపొందిన సింధు ఆదర్శ్ రెడ్డి మేయర్ గా ఎంపికవ్వబోతున్నారనే వార్త ప్రచారం జరుగుతోంది. నగరం నుండి కొందరు టిఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రముఖుల భార్యలు ఎన్నికల్లో ఓటమి పాలవ్వడంతో మేయర్ స్థానానికి కొంత పోటీ తగ్గినట్లు తెలుస్తోంది. సాయంత్రం ఎన్నికల ఫలితాలు విడుదలైన అనంతరం సింధు ఆదర్శ్ రెడ్డికి టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుండి పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది.
