వాట్సాప్‌లో ఇప్పటికే యూజర్లకు ఎన్నో రకాల సేవలను అందిస్తున్నారు. అనేక కంపెనీలు తమ కస్టమర్లకు వాట్సాప్ ద్వారా సేవలు అందిస్తున్నాయి. బ్యాంకింగ్ సేవలను కూడా వాట్సాప్ ద్వారా పొందేందుకు వీలు ఏర్పడింది. అయితే రైల్వే ప్రయాణికులు కూడా ఇకపై వాట్సాప్ ద్వారా తమ టిక్కెట్లకు చెందిన పీఎన్ఆర్ స్థితిని తెలుసుకోవచ్చు. అందుకు గాను రైలొఫై అనే స్టార్టప్ ఓ సర్వీస్‌ను ప్రారంభించింది.
రైలు ప్రయాణికులు +91-9881193322 అనే ఫోన్ నంబర్‌ను తమ కాంటాక్ట్ లిస్ట్‌లో సేవ్ చేసుకోవాలి. అనంతరం వాట్సాప్‌లో ఆ నంబర్‌కు తమ పీఎన్ఆర్ నంబర్‌ను పంపించాలి. దీంతో పీఎన్ఆర్ నంబర్ స్టేటస్ తెలిసిపోతుంది. అలాగే లైవ్ ట్రెయిన్ స్టేటస్, అంతకు ముందు వచ్చిన, రాబోయే రైల్వే స్టేషన్ల వివరాలు, తమ ప్రయాణ వివరాలను కూడా ప్రయాణికులు ఈ నంబర్ ద్వారా తెలుసుకోవచ్చు.