మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మియాపూర్ డివిజన్ తెరాస కార్పొరేటర్‌గా గెలుపొందిన ఉప్పలపాటి శ్రీకాంత్‌కు వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఉప్పలపాటి శ్రీకాంత్‌ను కలిసి వారు పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలియజేశారు.
