- జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్
హైదరాబాద్ నగరంలోని వరద బాధితులు మీ సేవకు వెళ్లొద్దని, వరద సహాయం నేరుగా వారి ఖాతాల్లోనే జమ అవుతుందని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ తెలిపారు. హైదరాబాద్‌లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క కుటుంబానికి రూ.10వేల సహాయం పంపిణీ చేస్తున్న విషయం విదితమే. మొదట్లో ఈ సహాయాన్ని నేతలు, అధికారులే నేరుగా బాధితుల వద్దకు వెళ్లి అందజేశారు. తరువాత మీ-సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. దీంతో ప్రజలు మీ-సేవ కేంద్రాల చుట్టూ తిరిగారు. తరువాత జీహెచ్ఎంసీ ఎన్నికలు రావడంతో సహాయం పంపిణీని తాత్కాలికంగా నిలిపివేశారు.
అయితే ప్రస్తుతం ఎన్నికలు అయిపోయిన నేపథ్యంలో ప్రభుత్వం మళ్లీ వరద సహాయాన్ని పంపిణీ చేయనుంది. ఈ క్రమంలోనే జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ మాట్లాడుతూ.. ప్రస్తుతం నగరంలో వరద బాధితుల వివరాలను సేకరిస్తున్నామని, జీహెచ్ఎంసీ బృందాలు అదే పనిలో నిమగ్నమయ్యాయన్నారు. వారు బాధితుల వివరాలను సేకరించి ఆధార్‌తో ధ్రువీకరిస్తున్నారని, కనుక బాధితులెవరూ మీ సేవ కేంద్రాలకు రావల్సిన పనిలేదని బాధితులకు వారి ఖాతాల్లోనే నేరుగా సహాయం జమ అవుతుందని తెలిపారు.
Nice updates
👍