నమస్తే శేరిలింగంపల్లి: హఫీజ్‌పేట్‌లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా జ్ఞానేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస అవసరాలు కూడా కరువయ్యాయని అన్నారు. ఆసుపత్రిలో కనీసం సెక్యూరిటీ లేరు, శానిటేషన్ సిబ్బంది లేరు, మాస్కులు గాని మరియు ఇతర నిత్యావసరాలు లేవని మండిపడ్డారు. ఆసుపత్రిలో కనీస అవసరాలు ప్రభుత్వం కల్పించాలని అని అన్నారు. కనీసం కోవిడ్కు సంబంధించిన కనీస అవసరాలు శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని కొండాపూర్ ఏరియా ఆసుపత్రితో పాటు పలు ప్రభుత్వ ఆసుపత్రిలో లేవని, ప్రభుత్వం వెంటనే స్పందించి మౌళిక సదుపాయాలు కలిపించాలని అన్నారు. తాము బాధ్యతగా ఫీడ్ ధ నీడిలాంటి స్వచ్ఛంద సంస్థల ద్వారా మాస్కులు, సెక్యూరిటీలు, శానిటైజర్ లాంటి నిత్యవసరాలను ఏర్పాటు చైయడం జరిగిందని అన్నారు.