భారత్ చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో వీర మరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు భార్య సంతోషిని యాదాద్రి జిల్లా ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ గా ప్రభుత్వం నియమించింది. కల్నల్ సంతోష్ బాబు అమరుడైన అనంతరం ఆయన కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం ఐదు కోట్ల రూపాయల ఆర్థిక సహాయంతో పాటు అతని భార్య సంతోషి కి గ్రూప్ 1 ఉద్యోగాన్ని సైతం ఇస్తామని హామీ ఇచ్చిన విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే యాదాద్రి జిల్లాకు ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ గా నియమించగా సోమవారం ఆమె బాధ్యతలు స్వీకరించారు.