శేరిలింగంపల్లి, అక్టోబర్ 1 (నమస్తే శేరిలింగంపల్లి): హెచ్‌సీఏ అండర్-16 సూపర్ లీగ్ టీమ్-సికి ఎంపికైన చందానగర్ పీజేఆర్ క్రికెట్ అకాడమీ విద్యార్థి బులా హితేష్ శేష సాయిని భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్, మాజీ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ సన్మానించారు. హితేష్‌ను అతని కాలేజ్‌లో కలిసిన ఎంఎస్కే ప్రసాద్ అతనికి శుభాకాంక్షలు తెలిపారు. హితేష్ ఇటీవలే హెచ్‌సీఏ అండర్-16 సూపర్ లీగ్ టీమ్-సికి ఎంపిక కాగా ప్రాబబుల్స్‌లోనూ చోటు దక్కించుకున్నాడు. దీంతో హితేష్‌కు పీజేఆర్ క్రికెట్ అకాడమీ హెడ్ కోచ్ రవి అభినందనలు తెలియజేశారు. తదుపరి రౌండ్ మ్యాచ్‌లలోనూ ప్రతిభ కనబరిచి మరిన్ని విజయాలను సాధించాలని అన్నారు.






