హైదరాబాద్ ఓడిపోవాలని వారంతా కోరుకుంటున్నారు…!

భారత క్రికెట్ అభిమానులకు ఐపిఎల్ అంటేనే పెద్ద వేడుక. ఊహించని గెలుపోటములు, ఉత్కంఠను రేపే మ్యాచులతో అభిమానులు ఆస్వాదించే అతిపెద్ద సంబురం. ఈ యేడు సైతం ఐపిఎల్ సీజన్ ఎన్నో అద్భుతాలతో, ఊహించని ట్విస్టులకు వేదికగా నిలిచింది. ఇదివరకు ఎన్నడూ లేని విధంగా ఈసారి ఐపిఎల్ లో చివరి రెండు లీగ్ మ్యాచులు మాత్రమే మిగిలి ఉన్నా ప్లే ఆఫ్ లో కేవలం ముంబై మాత్రమే సీటు దక్కించుకుంది. ప్లే ఆఫ్ కి వెళ్లే నాలుగు జట్లను సోమ, మంగళ వారాల్లో జరిగే మ్యాచులు నిర్ణయించనున్నాయి.

ఈ క్రమంలోనే అందరి దృష్టి తెలుగు ప్రజల అభిమాన జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ పైన పడింది. హైదరాబాద్ జట్టు ఆడిన 13 మ్యాచులలో కేవలం ఆరింటిలో మాత్రమే విజయం సాధించినప్పటికీ రన్ రేట్ విషయంలో మెరుగ్గా ఉండటం జట్టుకు కలిసొచ్చింది. దీంతో మంగళవారం ముంబై తో జరిగే మ్యాచులో విజయం సాధిస్తే ప్లే ఆఫ్ లో హైదరాబాద్ జట్టు బెర్తు దక్కించుకునే అవకాశం ఉంది. కాగా హైదరాబాద్ జట్టు గెలుపోటములు ప్లే ఆఫ్ రేసులో ఉన్న ఇతర జట్ల భవిష్యత్ ను నిర్ణయించనున్నాయి. ముఖ్యంగా కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు మిగిలిన రెండు లీగ్ మ్యాచుల ఫలితం కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. సోమవారం తలపడనున్న ఢిల్లీ డేర్ డెవిల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లలో విజయం సాధించిన జట్టు 16 పాయింట్లతో ప్లే ఆఫ్ చేరుకుని మొదటి క్వాలిఫయర్ లో ముంబై తో తలపడుతుంది. ఇక ఒడిన జట్టు రన్ రేట్ కలకత్తా కంటే తక్కువగా ఉంటే మాత్రం ప్రమాదంలో పడి కలకత్తాకు అవకాశం లభించనుంది. హైదరాబాద్ జట్టు ముంబైతో విజయం సాధిస్తే నెట్ రన్ రేట్ ఆధారంగా ఢిల్లీ, బెంగళూర్, కలకత్తా జట్టులలో ఒకరిని మాత్రం ఇంటికి పంపడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకవేళ హైదరాబాద్ జట్టు ఓడితే పై మూడు జట్లు ఊపిరి పీల్చుకుంటాయి. దీంతో హైదరాబాద్ జట్టు ఓడిపోవాలని కలకత్తా, బెంగళూర్, ఢిల్లీ జట్ల అభిమానులు కోరుకుంటున్నారట. ఇదిలా ఉంటె తెలుగు అభిమానులు మాత్రం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయం సాధించి ఫైనల్ చేరుకుంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here