జమ్మూ కాశ్మీర్(నమస్తే శేరిలింగంపల్లి): భూతల స్వర్గంగా పేరుగాంచిన కాశ్మీరు లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలని కోరుకుంటున్న ఇతర రాష్ట్రాల వారికి కేంద్రం తీపికబురు ను అందించింది. కేంద్రపాలిత ప్రాంతాలుగా మారిన జమ్ము , కాశ్మీరు, లడక్ లలో వ్యవసాయేతర భూముల కొనుగోలుకు భారతీయులందరికీ అవకాశం కల్పించేలా చట్టాలలో మార్పులు తీసుకువచ్చింది. ఆర్టికల్ 370 తొలగింపు అనంతరం జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టాలలో చేసిన మార్పులను జమ్ము కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా మీడియాకు వెల్లడించారు. అయితే వ్యవసాయ భూములను కేవలం వ్యవసాయం చేసే వారికి మాత్రమే బదిలీ చేసేలా నిబంధనలు రూపొందించినట్లు ఆయన తెలిపారు. జమ్మూకాశ్మీర్ లలో ఇతర రాష్ట్రాల పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడం ద్వారా ఈ ప్రాంతాలలో అభివృద్ధి సాధ్యపడుతుందని కేంద్రం భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.
As I guess in future all of us have no time to read and every one are showing interest in online news portals ..its good keep it up