రాష్ట్రంలో అరాచ‌క పాల‌న కొన‌సాగుతోంది

  • సిద్దిపేట పోలీస్ క‌మిష‌న‌ర్‌ను స‌స్పెండ్ చేయాలి
  • బీజేపీ శేరిలింగంప‌ల్లి ఇన్ చార్జి గ‌జ్జ‌ల యోగానంద్
  • చందాన‌గ‌ర్ అంబేద్క‌ర్ విగ్ర‌హం వ‌ద్ద పార్టీ నాయ‌కుల నిర‌స‌న

చందాన‌గ‌ర్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): రాష్ట్రంలో అరాచక పాలన కొన‌సాగుతుంద‌ని బీజేపీ శేరిలింగంప‌ల్లి ఇన్ చార్జి గ‌జ్జ‌ల యోగానంద్ అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌పై సిద్దిపేట‌ పోలీసులు దాడి చేసి ఆయ‌న‌ను అప్ర‌జాస్వామికంగా అరెస్టు చేశార‌ని ఆరోపిస్తూ పార్టీ శేరిలింగంప‌ల్లి నాయ‌కులు చందాన‌గ‌ర్ జీహెచ్ఎంసీ కార్యాల‌యం స‌మీపంలోని అంబేద్క‌ర్ విగ్ర‌హం వ‌ద్ద సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ‌ను ద‌హ‌నం చేశారు.

సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ‌ను ద‌హ‌నం చేస్తున్న బీజేపీ నాయ‌కులు

ఈ సంద‌ర్భంగా యోగానంద్ మాట్లాడుతూ.. బండి సంజ‌య్‌పై దాడి చేసి ఆయ‌న‌ను అప్రజాస్వామికంగా అరెస్టు చేసిన సిద్దిపేట పోలీస్ కమిషనర్ ను సస్పెండ్ చేయాల‌ని డిమాండ్ చేశారు. ఎలాగైనా దుబ్బాక ఎన్నికల్లో గెలవాలని అరాచకాలు సృష్టిస్తున్న రాష్ట్ర మంత్రి హరీష్ రావును బర్తరఫ్ చేయాల‌న్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో దుబ్బాక ఎన్నికలు నిర్వహించాలన్నారు.

బీజేపీ శేరిలింగంపల్లి నియోజకవర్గ కన్వీనర్ పోరెడ్డి బుచ్చిరెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. దుబ్బాక ఎన్నికల్లో ఓడి పోతామనే భయం తెరాస నాయకులకు పట్టుకుంద‌ని, దుబ్బాకలో రఘునందన్ రావు గెలుపు తథ్యం అని అన్నారు. సీఎం కేసీఆర్ పాలనపై ప్రజలు విసుగు చెందార‌ని, తెలంగాణ ప్రజలు బీజేపీకి మద్దతుగా నిలుస్తున్నార‌న్నారు. సీఎం కేసీఆర్ పోలీస్ వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టిస్తున్నార‌ని, దుబ్బాకలో బీజేపీ గెలుపును ఎవ్వరూ ఆపలేర‌ని అన్నారు. ఈ సంద‌ర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని బీజేపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అరెస్టులు చేసి చందానగర్, మియాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్ పోలీస్ స్టేషన్ ల‌కు తరలించారు.

చందాన‌గ‌ర్ పోలీసుల అదుపులో బీజేపీ నాయ‌కులు

ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రవీంద్ర ప్రసాద్ దూబే, వసంత్ కుమార్ యాదవ్, మనోహర్, రాజశేఖర్, మహిపాల్ రెడ్డి, అజిత్, బీజేపీ డివిజన్ అధ్యక్షులు రామ్ రెడ్డి, మాణిక్యారావు, రాజు శెట్టి, శ్రీధర్, ఆంజనేయులు, నారాయణరెడ్డి, బీజేవైఎం నాయకులు చంద్రమోహన్, విష్ణు, బీజేవైఎం శేరిలింగంపల్లి అసెంబ్లీ కన్వీనర్ కుమ్మరి జితేందర్, ఐటీ సెల్ అసెంబ్లీ కన్వీనర్ కళ్యాణ్, బీజేపీ మహిళ మోర్చా నాయకురాలు మేరీ, లలిత, శోభ దూబూ, ప్రశాంతి, నాయకులు రామకృష్ణ రెడ్డి, విజయ్, కిషన్, విజేందర్, శ్రీనివాస్ గుప్తా, అమర్నాథ్, బీజేవైఎం నాయకులు అజయ్, క్రాంతి, సిద్దూ, మధుసూదన్ రావు, మహేష్, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here