ఘనంగా దసరా

  • రావణదహనానికి భారీగా తరలివచ్చిన ప్రజలు

నమస్తే శేరిలింగంపల్లి : దసరా పండుగను పురస్కరించుకొని శేరిలింగంపల్లి డివిజన్ లోని హుడా ట్రేడ్ సెంటర్ రామాలయం వద్ద దసరా ఉత్సవాలు అంబరాన్నంటాయి. ప్రభుత్వ విప్ స్థానిక శాసనసభ్యులు అరికపూడి గాంధీ, శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద ఏర్పాటుచేసిన జమ్మికొమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఒకరికొకరు జమ్మిని పంచుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన “రావణ దహనం” కార్యక్రమాన్ని  సంప్రదాయబద్ధంగా నిర్వహించి రావణాసురుడిని దహనం చేశారు. ఈ సందర్బంగా విచ్చేసిన భక్తులు సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దుర్గామాత అనుగ్రహంతో శేరిలింగంపల్లి డివిజన్, నియోజకవర్గం మరియు రాష్ట్ర ప్రజలంతా దుర్గామాత అనుగ్రహంతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పురప్రముఖులు, సీనియర్ నాయకులు, ఆయా కాలనీ సంఘాల ప్రతినిధులు, యువకులు, మహిళలు, ప్రజలు తదితరులు భారీ ఎత్తున పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here