- భారీ బైక్ ర్యాలీ
- జెండా ఊపి ప్రారంభించిన రాష్ట్ర సగర సంఘం అధ్యక్షులు శేఖర్ సగర
నమస్తే శేరిలింగంపల్లి: అయోధ్యలో శ్రీరామచంద్ర బా విగ్రహ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ సగర సంఘం, గ్రేటర్ సగర యువజన సంఘం సంయుక్త ఆధ్వర్యంలో శ్రీరామ శోభా యాత్ర నిర్వహించారు.
ఈ శోబాయాత్ర హైదరాబాద్ పరిధిలోని గచ్చిబౌలి అంజయ్య నగర్ నుంచి కొత్తగూడ, కొండాపూర్, హఫీజ్పేట్, ఆల్విన్ కాలనీ, మియాపూర్, హైదర్ నగర్, జేఎన్టీయూ, కూకట్పల్లి, మూసాపేట్, జగద్గిరిగుట్ట వరకు నిర్వహించారు. దాదాపు 1000 బైకులతో సగర యువకులు శ్రీరామ జయ రామ జయ జయ రామ, జై శ్రీరాం అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. శ్రీరామచంద్రుని రథం, డీజే బాక్సులతో యువకులు ఉత్సాహంగా ఈ ర్యాలీని కొనసాగించారు. అంజయ్యనగర్ లోని సగర సంఘం రాష్ట్ర కార్యాలయం వద్ద తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర ఈ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు.
గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు మోడల రవి సగర ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరక్క సత్యం సగర, గ్రేటర్ హైదరాబాద్ గౌరవాధ్యక్షులు వెంకటస్వామి సగర, గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి వెంకట రాములు సగర, యాదాద్రి అన్నదాన సత్రం అధ్యక్షులు కేపీ రాములు సగర, తెలంగాణ సగర సంఘం రాష్ట్ర గౌరవ సలహాదారులు రామ్ సగర, రాష్ట్ర ఉపాధ్యక్షులు మోడల ఆంజనేయులు సగర, దిండి శేఖర్ సగర, సంయుక్త కార్యదర్శి ధామోదర్ సగర, కార్యనిర్వాహక కార్యదర్శి బంగారి ఆంజనేయులు సగర, కార్యవర్గ సభ్యులు మోడల విష్ణు సగర, రాష్ట్ర యువజన సంఘం ప్రధాన కార్యదర్శి ఉప్పరి మహేందర్ సగర, కోశాధికారి సందుపట్ల సాయి గణేష్ సగర, మాజీ రాష్ట్ర కోశాధికారి సందుపట్ల రాము సగర, గ్రేటర్ హైదరాబాద్ యువజన సంఘం అధ్యక్షులు ఎర్రం శెట్టి సీతారాం సగర, గ్రేటర్ సంఘం నాయకులు, అన్ని ప్రాంతీయ సంఘాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కోశాధికారులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతీయ సంఘాలైన అంజయ్య నగర్, జగద్గిరిగుట్ట, మూసాపేట్, రాయదుర్గం, ఫిలింనగర్, టిఎన్జీవోస్ కాలనీ, లింగంపల్లి, కొండాపూర్, హఫీజ్ పేట్, దేవెందర్ నగర్, కైసర్ నగర్, ఎల్లమ్మ బండ, మణికొండ తదితర సంఘాల సగర బంధువులు పెద్ద సంఖ్యలో ఈ శోభాయాత్ర బైక్ ర్యాలీలో హాజరయ్యారు. కాషాయ జెండాలు, సగర సంఘం జెండాలతో పాటు జైశ్రీరామ్, జై హనుమాన్, జై సగర, జై భగీరథ నినాదాలతో ఉన్న జెండాలు, ప్లెక్సీలతో ఈ శోభాయాత్ర శోభాయమానంగా కొనసాగింది.
- జగద్గిరిగుట్ట సగర సంఘం ఆధ్వర్యంలో అన్నదానం
శోభాయాత్ర అనంతరం జగద్గిరిగుట్ట సగర సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీరామచంద్రునికి సగర భగీరథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత మూడు రోజులుగా జగద్గిరిగుట్ట సగర సంఘం ఆధ్వర్యంలో వేలాది మందిని భక్తిపారవశంలో నిమగ్నం చేస్తూ వివిధ కార్యక్రమాలను చేపట్టారు.