- చందానగర్ డివిజన్ లో 4327 మంది గ్రాడ్యుయేట్స్ చే ఓటరు నమోదు
చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): పట్టభద్రుల ఓటరు నమోదులో చందానగర్ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి దూసుకుపోతున్నారు. రానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయడంపై అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. గ్రేటర్ ఎన్నికలకు పట్టభద్రుల ఓటరు నమోదుతో ముడి పెట్టినట్టు సమాచారం. తమ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసేందుకు వారు చేయించే పట్టభద్రుల ఓటర్ల సంఖ్యను కీలకంగా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందని కార్పొరేటర్ ఆశావహులకు పార్టీ పెద్దలు సూచించడంతో ఆ ప్రక్రియ జోరందుకుంది.

ఈ క్రమంలోనే చందానగర్ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి డివిజన్ పరిధిలో ఇప్పటివరకు 4327 మంది పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయించారు. ఇందులో కార్పొరేటర్ స్వతహాగా 3083 మందిచే ఎన్ రోల్ చేయించగా 1244 మందిని తన అనుచర గణం నమోదు చేయించారు. ప్రస్తుతం చందానగర్ డివిజన్ లో పట్టభద్రుల ఓటరు నమోదులో బొబ్బ నవత రెడ్డి ముందు వరుసలో నిలిచారు. అదేవిధంగా మిగిలిన ఆశావహుులతో పోలిస్తే నవత రెడ్డి పట్టభద్రులచే ఫామ్ 18 పత్రాలను స్వీకరించడంతో పాటు వాటిని ఆన్ లైన్ లో సైతం నమోదు చేయిస్తున్నట్టు సమాచారం.






