హైదర్ నగర్ (నమస్తే శేరిలింగంపల్లి): హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని పీజేఆర్ నగర్ పార్క్ లో అవని ఆర్గనైజషన్ ఆధ్వర్యంలో చిన్నారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. బాలల దినోత్సవం, దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆర్గనైజేషన్ ఫౌండర్ శిరీష సతూర్ పిల్లలకు ఆరోగ్యం, విద్య పై అవగాహన కల్పించారు. ప్రధానంగా పౌష్టికాహార లోపాల వలన వచ్చే సమస్యలు, విద్య నేర్చుకోవడం వలన కలిగే లాభాలను వివరించారు. అనంతరం చిన్నారులకు పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో అవని ఆర్గనైజేషన్ సభ్యులు పాల్గొన్నారు.