గచ్చిబౌలి(నమస్తే శేరిలింగంపల్లి): హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్‌నగర్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని శనివారం కార్పొరేటర్ గంగాధర రెడ్డి డివిజన్ పరిధిలోని గౌలిదొడ్డి ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులను కలిసి బిజెపి బలపరచిన అభ్యర్థి ఎన్.రామచంద్రారావుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.ఈ సందర్భంగా గంగాధరరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బిజెపి రోజురోజుకూ బలపడుతుందని, తాజాగా జరిగిన ఎన్నికల్లో ఫలితాలే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పునరావృతమవుతాయని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






