మియాపూర్(నమస్తే శేరిలింగంపల్లి): గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం చెరువులో లభ్యమైన సంఘటన మియాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం మియాపూర్ గురునాథం చెరువులో ఓ వ్యక్తి మృతదేహాన్ని కుళ్లిన స్థితిలో పోలీసులు కనుగొన్నారు. మృతుడికి సుమారు 30 సంవత్సరాల వయసు ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. సదరు వ్యక్తి మృతి చెంది రెండురోజులు అయి ఉండొచ్చని భావిస్తున్నారు. మృతుడు నలుపు రంగు కాటన్ ప్యాంటు, ఆరెంజ్, నలుపు గళ్ల చొక్కా ధరించి ఉన్నాడని, మృతుడి వివరాలు తెలిసిన వారు మియాపూర్ పోలీస్ స్టేషన్ లో సమాచారం అందించాలని పోలీసులు సూచించారు.






