గచ్చిబౌలి(నమస్తే శేరిలింగంపల్లి): కేంద్ర ప్రభుత్వం కార్పొరేటర్ సంస్థలకు రాయితీలు ఇస్తూ ఆర్థిక భారాన్ని పేద, సామాన్య ప్రజలపై మోపుతోందని సిపిఎం రంగారెడ్డి జిల్లా నాయకులు శోభన్ అన్నారు. పెరిగిన నిత్యవసర, ఇందన ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ గచ్చిబౌలి చౌరస్తా డివిజన్ నాయకుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు ప్లకార్డులను ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరైన శోభన్ మాట్లాడుతూ పెరుగుతున్న ధరల కారణంగా సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. మోడీ ప్రభుత్వం కేవలం కార్పొరేట్లకు లాభం చేకూర్చే విధంగా పాలన సాగిస్తోందని ఆరోపించారు. వెంటనే పెరుగుతున్న ధరలను నియంత్రించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి మండల కార్యదర్శి కృష్ణ, గచ్చిబౌలి నాయకులు రవీందర్, శ్రీనివాసరావు, తరుణ్, విజయ్ కుమార్, గణేష్, నాగరాజు, ప్రకాష్, మహిళలు సుజాత, అలివేలు, మంజుల, విజయమ్మ, విద్యార్థి నాయకులు రంజిత్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.