జెండా ఊపి ప్రారంభించిన చేతన్ ఆనంద్, ప్రభుత్వ విప్ గాంధీ

మాదాపూర్(నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ డివిజన్ పరిధిలోని మాతృశ్రీ నగర్ లో కాలనీ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రన్ ఫర్ క్లీన్, రన్ ఫర్ గ్రీన్ మాతృశ్రీ నినాదంతో 5కె రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్జున అవార్డు గ్రహీత, మాజీ బాడ్మింటన్ క్రీడా కరుడు చేతన్ ఆనంద్, ప్రభుత్వ విప్ గాంధీలు ముఖ్య అథితులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జెండా ఊపి 5కె రన్ ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ మంచి సంకల్పంతో కార్యక్రమ నిర్వహణ చేపట్టిన అసోషియేషన్ సభ్యులను అభినందించారు. శారీరక శ్రమ తో పాటు మానసిక ఉల్లాసం ఎంతో అవసరం అని , క్రీడలు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్య సంరక్షణకు దోహదం చేస్తుందని తెలిపారు. ఆరోగ్యకరమైన సమాజం కొరకు ఇటువంటి కార్యక్రమాలు జరగాలని అభిలాషించారు. మహిళా న్యాయమూర్తి బొమ్మతి భవానీ, కార్పోరేటర్ జగదీశ్వర్ గౌడ్, మియాపూర్ జోన్ ఏసీపీ కృష్ణప్రసాద్, సీఐలు వెంకటేష్, సుమన్, ఎస్సై రవికిరణ్, జీఎహెచ్ఎంసీ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ ఇంజనీర్లు ,శంకర్ ప్రశాంత్ లతో పాటు కాలనీవాసులు, మహిళలు, చిన్నారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
