– విజయదశమి నాటికి 30 రోజుల్లో 50k+ పేజ్‌వ్యూస్
అక్షర జ్ఞానమే తప్ప హంగులు, ఆర్భాటాలు లేవు. సంస్థాగతంగా పునాదులు కూడా పూర్తి కాలేదు. డిజిటల్ రంగంలో ఓనమాలు ఇప్పుడిప్పుడే నేర్చుకోవడమే తప్ప తల పండిన మేధావులు మా వెంట లేరు. కొత్త ప్రయత్నంలో ఎన్నో సందేహాలు, మరెన్నో భయాలు. తొలి అడుగులతోనే మొదలైంది మా ప్రయాణం. ఉన్నదల్లా సాధించగలమనే ఆత్మవిశ్వాసం, దానికి తోడుగా మీ ఆత్మీయత, అభిమానం, ఆదరణ, ఆశీర్వాదాలు. చినుకు చినుకు కలిసి వర్షమై, వరదలై పొంగినట్లు మాపై మీరు చూపిన ఆదరాభిమానాలు వ్యూస్ రూపంలో ఉప్పొంగుతున్నాయి. నెల రోజుల వ్యవధిలో “నమస్తే శేరిలింగంపల్లి” వెబ్ సైట్ #50000 పేజ్ వ్యూస్ లక్ష్యాన్ని చేరుకుందని సగర్వంగా మీకు తెలియపరచడానికి సంతోషిస్తున్నాం.
డిజిటల్ రంగంలో 50k views చిన్న సంఖ్య అయినా, కేవలం శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని మాత్రమే పరిధిగా చేసుకుని మేము చేసిన ప్రయత్నానికి స్వల్ప వ్యవధిలో మీరు అందించిన అపూర్వ స్పందనకు శిరసాభివందనాలు తెలుపుతున్నాను. మీ ఆదరాభిమానాలు మా సందేహాలను, భయాలను పటాపంచలు చేసి మా ఆత్మవిశ్వాసాన్ని మరింతగా పెంపొందించాయి. “విజయదశమి” సందర్భంగా శేరిలింగంపల్లి వాసులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. మీరు అందించిన ఈ అపూర్వ విజయోత్సాహంతో “నమస్తే శేరిలింగంపల్లి” సేవలు పూర్తి స్థాయిలో ప్రారంభిస్తున్నామని తెలియజేస్తున్నాం. ఇదే స్పూర్తితో మున్ముందు మా సేవలు మరింత ఉత్తమంగా అందించేందుకు కృషి చేస్తాం.
-వినయకుమార్ పుట్ట
Congratulations Anna
Congrats