గచ్చిబౌలి(నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేర్చుతానని డివిజన్ కార్పొరేటర్ గంగాధర్‌రెడ్డి అన్నారు. కార్పొరేటర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా నల్లగండ్ల మాజీ వార్డు సభ్యులు బొల్లంపల్లి విష్ణు వర్ధన్ రెడ్డి గంగాధర్ రెడ్డిని సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా గంగాధర్‌రెడ్డి మాట్లాడుతూ స్థానిక ప్రజలకు అందుబాటులో ఉంటానని ఏ సమస్య వచ్చినా నా దృష్టి కి తేవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గచ్చిబౌలి డివిజన్‌ను గ్రేటర్‌లో మొదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తానని తెలిపారు. కార్పొరేటర్‌కు శుభాకాంక్షలు తెలిపిన వారిలో స్థానిక నాయకులు విశాల్, ప్రవీణ్ తదితరులు ఉన్నారు.
