స్మశానవాటికలను మహాప్రస్థానంలా తీర్చిదిద్దుతాం: ప‌్ర‌భుత్వ విప్ గాంధీ

మాదాపూర్‌(న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ‌నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని అన్ని స్మ‌శాన‌వాటిక‌ల‌ను గ‌చ్చిబౌలి మ‌హాప్ర‌స్థానం మాదిరిగా ఆధునీక‌రిస్తామ‌ని ప్ర‌భుత్వ విప్ గాంధీ అన్నారు. శుక్ర‌వారం మాదాపూర్ డివిజన్ పరిధిలోని హరిజన బస్తీలో గ‌ల స్మశానవాటికలో నూతనంగా చేపట్టబోయే అభివృద్ధి పనులను మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్, ఫీనిక్స్ సంస్థ చైర్మన్ సురేష్ ల‌తో క‌లిసి ఆయ‌న ప‌రిశీలించారు.

హ‌రిజ‌న బ‌స్తీ స్మ‌శాన‌వాటిక‌ను ప‌రిశీలిస్తున్న ప్ర‌భుత్వ విప్ గాంధీ, కార్పొరేట‌ర్ జ‌గ‌దీశ్వ‌ర్‌గౌడ్‌, ఫీనిక్స్ సంస్థ చైర్మ‌న్ సురేష్ త‌దిత‌రులు

ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ హరిజన బస్తీలో స్మశానవాటిక అభివృద్ధి కోసం ఇప్పటికే రూ.2కోట్లు మంజూరు చేయడం జరిగిందని, ఈ స్మశానవాటిక‌లో అన్ని వ‌స‌తుల‌ను ఏర్పాటు చేసి సుంద‌రంగా తీర్చిదిద్దుతామని అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో మాదాపూర్ డివిజ‌న్‌ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ స్థానిక నాయ‌కులు సయ్యద్ గౌస్, శాస్త్రీ యాదవ్, వెంకటేష్ యాదవ్, సహదేవ్, అర్జున్, ప్రభు, రాజు, కిట్టు, కృష్ణ, గణేష్, దర్శన్, యాదయ్య, బాలయ్య, దశరథ్, వార్డు సభ్యులు రాంచందర్, శ్రీనివాస్, సత్తి రెడ్డి తదితరులు పాల్గొన్నారు..

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here