నమస్తే శేరిలింగంపల్లి: దళితులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకం ఎంతగానో దోహదపడుతుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రేమ్ నగర్ కి చెందిన సంతోష్ కు, మియాపూర్ డివిజన్ పరిధిలోని చిరంజీవి నగర్ కి చెందిన రమేష్ కు దళితబంధు పథకం ద్వారా మంజూరైన కార్లను మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ దశల వారిగా దళిత బంధు పథకం పూర్తి స్థాయిలో అమలవుతుందని, ఈ సంవత్సరంలో 2000 మంది లబ్ధిదారులకు అవకాశం కలిపిస్తామన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. దళితుల్లో ద్విగుణీకృత మార్పు తీసుకురావడానికి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని శేరిలింగంపల్లి నియోజవర్గంలో 100 మంది లబ్ధిదారులకు వర్తింపజేస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా దళిత బంధు పథకం కింద వాహనాలు పొందిన లబ్ధిదారుడు మాట్లాడుతూ దినసరి కూలి నుండి కారు ఓనర్ గా మార్చిన సందర్భంగా స్వీట్లు పంచుతూ, హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ అధ్యక్షులు రాజు నాయక్, హఫీజ్ పేట్ డివిజన్ గౌరవ అధ్యక్షుడు వాలా హరీష్ రావు, నాయకులు బ్రిక్ శ్రీనివాస్, గుమ్మడి శ్రీనివాస్ , నర్సింహ రాజు తదితరులు పాల్గొన్నారు.