వైభవంగా ముగిసిన శ్రీవారి మూల మంత్ర జపదీక్ష

శ్రీ వారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న ఆలయ ప్రధాన అర్చకులు, విశాఖ శ్రీ శారదా పీఠం రాష్ట్ర ఆగమ సలహాదారు సుదర్శనం సత్యసాయి

– 20 ఏళ్లుగా దీక్ష చేస్తున్న చందానగర్ వెంకటేశ్వర ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ సుదర్శనం సత్యసాయి

చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ లోని విశాఖ శ్రీ శారదా పీఠ పాలిత వెంకటేశ్వర ఆలయ ప్రధాన అర్చకులు, పీఠం రాష్ట్ర ఆగమ సలహాదారు శ్రీ సుదర్శనం సత్యసాయి చేపట్టిన శ్రీవారి మూల మంత్ర జప దీక్ష ఆదివారంతో ముగిసింది. గత 20 సంవత్సరాలుగా అటు దేవాలయం ఇటు గ్రామ అభివృద్ధి కొరకు సుదర్శనం సత్యసాయి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి మూల మంత్రం జప దీక్ష చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది దేవాలయ అభివృద్ధితో పాటుగా కరోనా నివారణార్థం గత 41 రోజుల నుండి కొనసాగిన దీక్ష ఆదివారం ముగిసింది.

పూర్ణాహుతి లో భాగంగా హోమ ద్రవ్యాలను సమర్పిస్తున్న సుదర్శనం సత్యసాయి

దీక్ష విమణలో భాగంగా శనివారం సాయంత్రం నుండి తర్పణం హోమం, సుప్రభాతం, పంచామృతమలు, వివిధ రకాల పళ్ళ రసములతో మహా అభిషేకం, విశేష పుష్ప అలంకారం, అగ్ని మధనం, పూర్ణాహుతి, శాంతి కళ్యాణం, పండిత సత్కారం, హారతి, తదితర పూజా కార్యక్రమాలతో పాటు విచ్చేసిన భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. సుదర్శనం సత్యసాయి స్వీయ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమాలలో ఆలయ పాలకమండలి సభ్యులు, దేవాలయ సేవా సమితి సభ్యులు, పరిసర ప్రాంత భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రత్యేక పూజల్లో పాల్గొన్న పరిసర ప్రాంతాల భక్తులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here