గచ్చిబౌలిలో భ‌వనం సెంట్రింగ్ కూలి 8 మందికి గాయాలు

మ‌హ‌వీర్ నిర్మాణ సంస్థ భ‌వ‌నం సెంట్రింగ్ కూలిన దృశ్యం

గ‌చ్చిబౌలి (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): నిర్మాణంలో ఉన్న ఓ భ‌వ‌నంలో ప్ర‌మాదం చోటు చేసుకోవ‌డంతో ఎనిమిది మంది కూలీల‌కు గాయాలైన సంఘ‌ట‌న గ‌చ్చిబౌలి పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. గ‌చ్చిబౌలి విప్రొ స‌ర్కిల్ స‌మీపంలో మ‌హ‌వీర్ క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్ వారు భారీ ట‌వ‌ర్ నిర్మాణం చేప‌ట్టారు. ఈ క్ర‌మంలోనే బిల్డింగ్‌లోని మొద‌టి అంత‌స్థుకు స్లాబ్ వేసేందుకు సెంట్రింగ్ ప‌నులు పూర్తి చేశారు. ఆదివారం స్లాబ్ వేస్తున్న క్ర‌మంలో సెంట్రింగ్ కూలిపోయింది. దీంతో అక్క‌డ విధులు నిర్వ‌హిస్తున్న సందీప్‌, శ్ర‌వ‌ణ్‌, సాక‌ర్‌, సురేష్, రాజ‌న్‌, జ‌య‌ప్ర‌కాష్‌, సందీప్‌, రాంసింగ్ అనే 8 మంది కార్మికులు గాయ‌ప‌డ్డారు. దీంతో నిర్మాణ‌దారులు వారిని స్థానిక ప్రైవేట్ హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. ఈ మేర‌కు గ‌చ్చిబౌలి పోలీసులు కేసు న‌మోదు చేశారు. నిర్మాణ సంస్థ నిర్ల‌క్ష‌మే ప్ర‌మాదానికి కార‌ణ‌మ‌ని ప్రాథ‌మిక విచార‌ణ‌లో తేల‌డంతో ఆ కోణంలో ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేశారు.

మ‌హ‌వీర్ నిర్మాణ సంస్థ భ‌వ‌నం సెంట్రింగ్ కూలిన దృశ్యం

 

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here