ఆకట్టుకున్న సురభి కళాక్షేత్రం థియేటర్ ఫెస్టివల్

నమస్తే శేరిలింగంపల్లి: కళలను, కళాకారులను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని, ముఖ్యంగా సురభి కళాక్షేత్రం ద్వారా కొత్త వారికి అవకాశం కల్పిస్తున్న నిర్వాహకులు, దర్శకులు సిందె రమేష్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ప్రముఖ సినీ‌నటుడు, రచయిత తనికెళ్ల భరణి అన్నారు. భాష సాంస్కృతిక శాఖ శాఖ, తెలంగాణా ప్రభుత్వం , సురభి కళాక్షేత్రమ్ సంయుక్త నిర్వహణలో గచ్చిబౌలి రంగ్ భూమి వేదికపై థియేటర్ ఫెస్టివల్ నిర్వహించారు. అందులో భాగంగా సురభి కళాక్షేత్రం థియేటర్ గ్రూప్ యాక్టింగ్ వర్క్ షాప్ విద్యార్థులతో నిర్వాహకులు, దర్శకుడు సిందె రమేష్ నేతృత్వంలో రచ్చబండ, సారి రాంగ్ నంబర్, గోగ్రహణం నాటికల ప్రదర్శన ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి తనికెళ్ల భరణి హాజరై నాటికలను ఆసక్తిగా తిలకించారు. ‌

గో గ్రహణం నాటకంలో ఓ సన్నివేశం

ఈ సందర్భంగా సిందె రమేష్ మాట్లాడుతూ సురభి ఉన్నతి కోసం, సురభి పరిరక్షణ కోసం మా పెద్దలు సైతం ఎంతగానో కృషి చేశారన్నారు. సురభి పేరు సంపాదన, అభ్యున్నతి కోసం పాటుపడుతూ మా యంగ్ స్టర్స్ ను సైతం ప్రోత్సహించడం జరుగుతుందని అన్నారు. నాటకాల స్థాయి నుంచి సురభి యంగ్ స్టర్స్ యాక్టింగ్ వర్క్ షాప్ విద్యార్థులతో థియేటర్ ఫెస్టివల్ ఏర్పాటు చేసే స్థాయికి రావడం గర్వంగా ఉందన్నారు. ఒక థియేటర్ ఫెస్టివల్ చేసేంత ఎదిగామంటే దానికి ప్రధాన కారణం మా సురభి యంగ్ స్టర్స్ అని, నాటకం పట్ల ఉన్న అభిమానం, దృఢనిశ్చయం తో రెండేళ్లుగా వీకెండ్ వర్క్ షాప్, మూడు నెలల నిరంతర శ్రమతో ఒకే సారి మూడు నాటికలను ప్రదర్శించి ఓరా అనిపించారని రమేష్ అన్నారు.

రచ్చబండ నాటకంలో ఓ సన్నివేశం

తమకు ఉన్నతికి ఎప్పటికప్పుడు సలహాలిచ్చిన తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కెవి రమణా చారీ, ఈ అవకాశమిచ్చి ప్రోత్సహించిన భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, మా థియేటర్ ఫెస్టివల్ కి విచ్చేసి ఈ నాటక ప్రదర్శనకు వన్నె తెచ్చిన తనికెళ్ల భరణి, చిలకమర్తి నటరాజ్, డా. ఖాజాపాష, పట్టెపు సాయిలు, షేక్ జాన్ బషీర్, ఫిల్మ్ మేకర్ పంజా శ్రవణ్, పెద్దలు గోపిసెట్టి కేశవరాము, ఎస్ ఎ రఘునాధ్, ఆర్. కోదండరావు, సురభి ప్రసాద్, మా యాక్టింగ్ వర్క్ షాప్ లో విద్యార్దులకు యాక్టింగ్ లో మెలకువలు నేర్పిన పట్టెపు సాయిలు, సుజీత్ రెడ్డి, సురభి సంతోష్, రాఘవేంద్రరావు లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నాటక ప్రదర్శనలకు మ్యూజిక్, లైటింగ్, సెట్టింగ్, సౌండ్, సాంకేతిక సహాయాన్ని అందించిన వి. ఉమాశంకర్, మువ్వపాటి నాగరాజు, శ్రీనాథ్, ధర్మేంద, సురభి సంతోష్, జయవర్దన్, జితేంద్ర, పెస్టివల్ నిర్వహణకు థియేటర్ లో అన్ని ఏర్పాట్లు చేసిన రంగభూమి యాజమాన్యానికి, యూత్ ప్రెసిడెంట్ చిరంజీవి, సురభి యువసేన సభ్యులకి, అవేటి మనోహర్ సురభి కళామందిర్, సురభి కాలనీవాసుల సంక్షేమ సంఘం, సురభి కుటుంబ సభ్యులందరికి సురభి కళా క్షేత్రం తరపున దర్శకుడు సిందె రమేష్ ధన్యవాదాలు తెలిపారు.

సురభి కళాక్షేత్రం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతున్న తనికెళ్ళ భరణి, వేదికపై సిందే రమేష్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here