అన్నప్రాసన కోసమని వెళ్లి అనంతలోకాలకు – రోడ్డు ప్రమాదంలో ఆర్నెల్ల చిన్నారి సహా కుటుంబంలో నలుగురు మృతి

నమస్తే శేరిలింగంపల్లి: ఆర్నెల్ల పాపకు అన్న ప్రాసన చేయించేందుకు బయల్దేరిన‌ కుటుంబ సభ్యులు అనంత లోకాలకు వెళ్లిన ఘటన చందానగర్ హుడా కాలనీలో చోటుచేసుకుంది. అతివేగం ఆరునెలల పసిపాపతో సహా నలుగురి ప్రాణాలను బలిగొన్నది. మరణించినవారంతా ఒకే కుటుంబానికి చెందిన వారవడంతో ఆ కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి. చందానగర్ హుడా కాలనీకి చెందిన కుటుంబరావు కు ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు‌ ఉన్నారు. చిన్న కుమార్తె శాంతికి ఆర్నెల్ల పసిపాప ప్రిన్సెస్ అన్నప్రాసన చేయించేందుకు అల్లుని స్వగ్రామం జంగారెడ్డి గూడెంకు కుటుంబ సభ్యులతో కలిసి కారులో శనివారం రాత్రి 11 గంటలకు బయల్దేరారు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు కృష్ణా జిల్లా జగ్గయ్య పేటకు చేరుకోగానే అతివేగంతో వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని పల్టీలు కట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న 6 నెలల చిన్నారి ప్రిన్సెస్ తో సహా కుటుంబరావు (65) భార్య మేరీ (53) కూతురు ఇందిర (30), కోడలు శాంతి( 32) అక్కడికక్కడే మృత్యువాతకు గురయ్యారు. జోషి (36) ఒక్కడే తీవ్ర గాయాలకు గురవడంతో స్థానికులు దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ప్రాణాలు దక్కించుకున్నాడు. అన్నప్రాసన కోసం వెళ్లిన వారు రోడ్డు ప్రమాదంలో అసువులుబాయడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు.

డివైడర్ ను ఢీ కొట్టి పల్టీపడటంతో నుజ్జునుజ్జయిన కారు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here