నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ డివిజన్ మాదాపూర్ మస్తాన్ నగర్ లో సమస్యలపై బిజెపి నాయకులు రవికుమార్ యాదవ్ బస్తీ బాట కార్యక్రమాన్ని చేపట్టారు. స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకోగా కొన్ని రోజులుగా మంచి నీటి కొరత, రోడ్లు, పారిశుధ్య సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో అధికారులు, పాలకులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు. ఎన్ని సార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. కాలనీ వాసులే స్వంత ఖర్చులతో నీటి వసతి కల్పించుకున్నారన్నారు. కాలనీకి మంజీరా నీటి సరఫరా అయ్యేలా చూస్తామని రవికుమార్ యాదవ్ చెప్పారు. ఈ కార్యక్రమంలో రాధా కృష్ణ యాదవ్, ఎల్లేష్ బస్తీవాసులు అంజయ్య, నర్సయ్య, డేవిడ్, లక్ష్మణ్, బాలరాజు, జమ్మయ్య, అజయ్, గోపి తదితరులు పాల్గొన్నారు.