అమృతదారలా కొనసాగిన డా. శోభరాజ్ సంకీర్తనలు

నమస్తే శేరిలింగంపల్లి: వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా మలేషియన్ టౌన్ షిప్ లోని రెయిన్ ట్రీ పార్క్ ఫెస్టివల్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం అన్నమాచార్య భావనా వాహిని వ్యవస్థాపకురాలు, “అన్నమయ్య పదకోకిల” పద్మశ్రీ .డా.శోభరాజు అన్నమాచార్య సంకీర్తనా విభావరి నిర్వహించారు.‌ ఈ కార్యక్రమంలో శోభరాజు అన్నమయ్య కీర్తనలను, గణనాథుని కీర్తనలను తీయ తేనియల తేటగా ఆలపించారు. స్వామి వారికి కైంకర్యం చేసిన గజరాజ గుణరాజా, వేడుకొందామా, చాలదా హరినామ, తందానానా, కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు, రావమ్మా మహాలక్ష్మీ, ఎంత అందంగాడవురా మొదలగు సంకీర్తనలు ఆలపించారు. శోభరాజ్ సంకీర్తనలు శ్రోతలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి డా శోభా రాజు శిష్యులు కుమారి సాహితి అడపా , కుమారి అనన్య మంత్రవాది గాత్ర సహకారం అందించగా కీబోర్డ్ గురుప్రసాద్, తబలా జయకుమార్ ఆచార్య‌ వాయిద్య సహకారం అందించారు. డాక్టర్ శోభరాజు సంకీర్తనా గానం అమృత ధార లా సాగిందని నిర్వాహకులు నర్సింహులు కొనియాడారు.

డాక్టర్ శోభరాజ్ సంకీర్తన విభావరి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here