నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ లోని శిల్పారామంలో సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ఆదివారం శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని అభినయవాణి నృత్య నికేతన్ గురువు పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చిన సత్యం కుమార్తె బాల త్రిపురసుందరి శిష్య బృందం శ్రీకృష్ణ పాటల పై చేసిన కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. గణపతి గీతం, దశావతారం, వసంత స్వర జాతి, నారాయణీయం, ముద్దుగారే యశోద, కోలాటం, తరంగం తదితర అంశాలపై నాట్య ప్రదర్శన చేశారు. కళాకారులు శ్రీ సౌమ్య, భువన రెడ్డి, శ్రీయ, సృజన, ఇషితా, ప్రియఃసిని, అనురిత, సహన, సంజన, దీక్షితులు, శశి చల్ల, శ్రీనివాస్, అద్వైత, మోక్ష, భావన, కృష్ణ ప్రియా, కాత్యాయని తదితరులు చేసిన ప్రదర్శనలు పలువురిని ఎంతగానో ఆకట్టుకున్నాయి.