నమస్తే శేరిలింగంపల్లి: టీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. ఆస్పత్రి లో అత్యవసర చికిత్స కోసం హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని సాయి నగర్ కి చెందిన శరీనా బేగం ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా సీఎంఆర్ఎఫ్ ద్వారా ముందస్తుగా మంజూరైన రూ. 2 లక్షల ఎల్ ఓ సీ పత్రాన్ని ఆదివారం శరీనా బేగం కుటుంబ సభ్యులకు ఆరెకపూడి గాంధీ అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా కృషి చేస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా నిరంతరం సేవలను అందిస్తూ ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా ఆదుకుంటున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆల్విన్ కాలనీ డివిజన్ అధ్యక్షుడు జిల్లా గణేష్, నాయకులు సత్యనారాయణ తదితరులు పాల్గొనారు.