నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ లోని శిల్పారామం లో శ్రీ రాధికా సంగీత నృత్య అకాడమీ, తెలంగాణ ప్రభుత్వం భాష సాంస్కృతిక శాఖ సంయుక్త నిర్వహణ లో రమణి సిద్ది కూచిపూడి నృత్య నీరాజనం సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రముఖ నాట్య గురువులు సీత నాగ జ్యోతి న్యూ ఢిల్లీ, హైదరాబాద్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జొన్నలగడ్డ అనురాధ అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కూచిపూడి నృత్య నీరాజనం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సీత నాగ జ్యోతి శిష్య బృందం ప్రదర్శించిన కూచిపూడి అంశాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. పద్మభూషణ్ వెంపటి చిన సత్యం రూపొందించిన వాణికి వందనం, జతిస్వరం, ఓరాశబ్దం, లింగాష్టకం, అన్నయ్య కృతి, శివరంగం, పూర్వ రంగం, అంశాలను ఎంతో ఆకర్షణీయంగా ప్రదర్శించారు. అభినయ నాగజ్యోతి, శ్రీథనాయ శర్మ, సాయి శిరీష, అపర్ణ రెడ్డి, శ్రావ్య శేషాద్రి, చార్వి, మేఘ తదితరులు ఈ నృత్య ప్రదర్శన చేశారు. ఇందుమతి ఘంటి శిష్య బృందం ఎందరో మహానుభావులు, రామదాసు కీర్తన, హిమగిరి తనయ అంశాలను ప్రదర్శించారు. కళాకారులందరికి రమణ సిద్ది చేతుల మీదుగా సన్మాన చేశారు.