నమస్తే శేరిలింగంపల్లి: అభిమానుల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటానని, ఎలాంటి సమస్య ఉన్న తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తానని చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి పేర్కొన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ డివిజన్ కు చెందిన జహీరుద్దీన్ కు ఎంపీ రంజిత్ రెడ్డి అంటే ఎనలేని అభిమానం. జహీరుద్దీన్ గత కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురై కాలు విరగడంతో ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఎంపీ రంజిత్ రెడ్డి శనివారం చందానగర్ లోని జహీరుద్దీన్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. తన కోసం, టీఆర్ఎస్ పార్టీ కోసం తనవెంట నడిచే ప్రతీ కార్యకర్త, అభిమానికి అండగా ఉండి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటానని ఎంపీ రంజిత్ రెడ్డి తెలిపారు. ఆయన వెంట టీఆర్ఎస్ పార్టీ చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి ఉన్నారు.