రైతుల పోరాట ఫలితమే మోడీ ప్రకటన: బహుజన్ సమాజ్ పార్టీ సీనియర్ నాయకుడు ఇంటివెనుక అరుణ్

నమస్తే శేరిలింగంపల్లి: రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయడం రైతుల విజయం అని బహుజన్ సమాజ్ పార్టీ సీనియర్ నాయకుడు ఇంటివెనుక అరుణ్ అన్నారు. బిజెపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని గత ఏడాదిగా చేస్తున్న పోరాటానికి ఫలితం దక్కిందన్నారు. రైతు చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రధాని మోడీ తో ప్రకటన చేయించి రైతులు విజయం సాధించారని అన్నారు. భారత ప్రజాస్వామ్యం దేశంలో అహంకార పూర్తిగా పరిపాలన కొనసాగుతుందని, దేశంలో మోడీ ప్రజా కార్మిక రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారని పేర్కొన్నారు. సంవత్సర కాలంలో మోడీ ప్రభుత్వానికి రైతుల నిరసనలతో చుక్కలు కనబడ్డాయని అన్నారు. రైతుల నిరసనలకు బయపడి రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటన ఇచ్చారన్నారు. ఈ పోరాటంలో ప్రాణాలర్పించిన రైతులను మరవమని అరుణ్ పేర్కొన్నారు.

బహుజన్ సమాజ్ పార్టీ సీనియర్ నాయకుడు ఇంటివెనుక అరుణ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here