శిల్పారామంలో నేషనల్ హ్యాండ్‌లూమ్ ఎక్స్‌పో కు విశేష స్పంద‌న‌

నమస్తే శేరిలింగంపల్లి:మాదాపూర్ లోని శిల్పారామంలో నిర్వహిస్తున్న నేషనల్ హ్యాండ్లూమ్ ఎక్స్‌పో కు సందర్శకుల నుండి విశేష స్పంద‌న‌ వస్తుంది. మంగళగిరి, భాగల్పూరి, నారాయణపేట, పోచంపల్లి, బనారస్, గొల్లబామ, వెంకటగిరి తదితర కాటన్ చీరలు, బెడ్ షీట్స్ తో స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా యంపీ థియేటర్ లో మైసూర్ నుండి విచ్చేసిన భరతనాట్య కళాకారులు హరీష్ కుమార్ బృందం నృత్య ప్రదర్శన ఇచ్చింది. నృత్య నది బృందం పేరిట దీప్తి దీక్షిత్, నేసారా విజయ్, సుప్రజ లు మలయా ప్రాప్తి, గజవదాన కృతి, నటేశ కౌతం, హరి హర, విష్ణు స్తుతి, భాగ్యదా లక్ష్మి, కీర్తన, దేవర్ణమా, తిల్లాన, మంగళం తదితర అంశాలను ప్రదర్శించి మెప్పించారు.

నేషనల్ హ్యాండ్లూమ్ ఎక్స్ పో లో చేనేత వస్త్రాలను కొనుగోలు చేస్తున్న మహిళలు
శిల్పారామంలో కళాకారుల నృత్యప్రదర్శన
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here