నల్లగండ్ల ఫ్లైఓవర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. వాటర్ ట్యాంకర్ ఢీకొని వ్యక్తి మృతి

శేరిలింగంపల్లి, న‌వంబ‌ర్ 12 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): వాటర్ ట్యాంకర్ డ్రైవర్ నిర్ల‌క్ష్యం కార‌ణంగా ఓ వ్య‌క్తి ప్రాణాలు కోల్పోయాడు. ట్యాంక‌ర్‌ను డ్రైవ‌ర్ వేగంగా, నిర్ల‌క్ష్యంగా న‌డిపించి ద్విచ‌క్ర వాహ‌న‌దారుడిని ఢీకొట్ట‌డంతో అత‌ను తీవ్ర‌గాయాల పాలై హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. చందాన‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకున్న ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసులు తెలిపిన ప్ర‌కారం వివ‌రాలు ఈ విధంగా ఉన్నాయి. గ‌చ్చిబౌలి నుంచి ప‌టాన్‌చెరు వైపు ఎ.రాజ్‌కుమార్ (40) అనే వ్య‌క్తి త‌న హోండా యాక్టివా (టీఎస్ 15 ఎఫ్‌పీ 0112)పై ప్ర‌యాణిస్తున్నాడు. మార్గ‌మ‌ధ్య‌లో న‌ల్ల‌గండ్ల ఫ్లై ఓవ‌ర్ సిగ్న‌ల్ వ‌ద్ద వాట‌ర్ ట్యాంక‌ర్ (టీఎస్ 08 యూఏ 8274)ను డ్రైవ‌ర్ వేగంగా, నిర్ల‌క్ష్యంగా న‌డిపిస్తూ యాక్టివాను ఢీకొట్టాడు. దీంతో రాజ్‌కుమార్‌కు తీవ్ర గాయాలు కాగా అతన్ని వెంట‌నే చికిత్స నిమిత్తం హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. అత‌న్ని ప‌రీక్షించిన వైద్యులు అప్ప‌టికే అత‌ను మృతి చెందిన‌ట్లు నిర్దారించారు. ఈ మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here