రాఘవేంద్ర కాలనీ సి బ్లాక్ సంక్షేమ సంఘం నూతన అధ్యక్షునిగా జూపల్లి శ్రీనివాస్

నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ డివిజన్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీ సి బ్లాక్ సంక్షేమ అండ్ కల్చరర్ అసోసియేషన్ నూతన కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారులుగా తులసిరాం, జనార్దన్, రాఘవ రెడ్డి లు వ్యవహరించగా నూతన అధ్యక్షునిగా జూపల్లి శ్రీనివాస్ రావు, ఉపాధ్యక్షునిగా ఎం. వెంకటేష్, ప్రధాన కార్యదర్శిగా సురేందర్ రెడ్డి, జాయింట్ సెక్రటరీగా రేణుక, ట్రెజరర్ గా రామ మూర్తి లు ఎన్నికయ్యారు. ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా ప్రమీల, ఇసప్ప, రమాదేవి, చిన్న పుల్లారెడ్డి, ప్రకాష్ రావు, సీతారత్నం, కొండపల్లి సురేష్, రజనీకాంత్, చంద్రమౌళి లు ఎన్నికయ్యారు. కలిసికట్టుగా ఉండి కాలనీ అభివృద్ధికి కృషి చేస్తామని నూతన కమిటీ సభ్యులు తెలిపారు. సమస్యలు లేని కాలనీ గా ఆదర్శంగా ఉండే విధంగా తీర్చిదిద్దుతామని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో బాల్ రెడ్డి, నిర్మల, శృతి తదితరులు పాల్గొన్నారు.

రాఘవేంద్ర కాలనీ సి బ్లాక్ సంక్షేమ సంఘం నూతన‌ కార్యవర్గం
జూపల్లి శ్రీనివాస్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here