ఎస్టీ మోర్చా నూతన బాధ్యుడికి రవికుమార్ యాదవ్ అభినందనలు

శేరిలింగంపల్లి, న‌వంబ‌ర్ 12 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): రంగారెడ్డి అర్బన్ జిల్లా ఎస్టీ మోర్చా ప్రధాన కార్యదర్శిగా, కార్యదర్శిగా నూతనంగా నియమితులైన రాయుడు నాయక్‌ను బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ రవికుమార్ యాదవ్ అభినందించారు. ఈ సందర్భంగా నూతన బాధ్యతలు చేపట్టిన రాయుడు నాయక్‌ రవికుమార్ యాదవ్‌ను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

అనంతరం రవికుమార్ యాదవ్ నూతన బాధ్యుడికి శాలువాలు కప్పి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీలో కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం, గుర్తింపు లభిస్తాయనడానికి ఈ నియామకాలే నిదర్శనమని అన్నారు. గిరిజనుల హక్కులు, సంక్షేమం కోసం నిరంతరం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, రంగారెడ్డి అర్బన్ జిల్లా వ్యాప్తంగా బీజేపీని మరింత పటిష్టం చేయాలని సూచించారు. తన‌పై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తాన‌ని, శేరిలింగంపల్లి నియోజకవర్గంతోపాటు రంగారెడ్డి అర్బన్ జిల్లా వ్యాప్తంగా బీజేపీ విజయానికి సైనికుల్లా పనిచేస్తాన‌ని నూతన బాధ్యుడు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్టీ మోర్చా ఉపాధ్యక్షుడు హనుమంత్ నాయక్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here