శేరిలింగంపల్లి, నవంబర్ 10 (నమస్తే శేరిలింగంపల్లి): హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థి సంఘ ఎన్నికల సందర్భంగా జరిగిన ఘటనలో నెల రోజుల పాటు జైలు జీవితం గడిపిన విద్యార్థి మోహిత్‌ను శేరిలింగంపల్లి సీపీఎం పార్టీ జోన్ కార్యవర్గ సభ్యుడు కొంగరి కృష్ణ పరామర్శించారు. ఈ సందర్భంగా మోహిత్‌కు ధైర్యం చెప్పారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం వెనుకడుగు వేయకుండా ధైర్యంగా పోరాటం కొనసాగించాలని సూచించారు. విద్యార్థుల హక్కులు, సమస్యలపై నిరంతరం పోరాడాలని, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా ముందుకు సాగాలని కొంగరి కృష్ణ అన్నారు.






