తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా ఉగాది సంబరాలు – రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు

నమస్తే శేరిలింగంపల్లి: తెలుగు సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా శిష్ట కరణ సామాజిక కుటుంబ సభ్యులతో కలిసి ఉగాది సంబరాలు నిర్వహించడం గర్వకారణమని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర శిష్ట కరణ సంక్షేమ సంఘం అధ్యక్షులు, జాతీయ ఓబీసీ సాధన కమిటీ కన్వీనర్ డీవీ కృష్ణారావు ఆధ్వర్యంలో ఫ్రెండ్స్ కాలనీలో శిష్ట కరణం సంక్షేమ సంఘం హైదరాబాద్ కార్యాలయ ఆవరణలో శ్రీ శుభ కృత నామ సంవత్సర ఉగాది సంబరాలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు మాట్లాడుతూ పండుగలు మన తెలుగు సంస్కృతి సంప్రదాయాలను తెలియజేస్తాయని, వాటిని పరిరక్షించేందుకు ప్రజల భాగస్వామ్యం అవసరమని అన్నారు.

శిష్టకరణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉగాది సంబరాల్లో పాల్గొని మాట్లాడుతున్న రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు

 

తెలుగువారికి గొప్ప పండుగ తొలి పండగ ఉగాది అని యుగానికి ఆది గనుక ఉగాది అంటారని ఉగాది పచ్చడి సర్వ మానవ సౌభ్రాతృత్వాన్ని ప్రతిభంబిస్తుందని ఆయన తెలిపారు. ఇలాంటి గొప్ప కార్యక్రమం నిర్వహించిన శిష్ట కరణం సమాజం వారితో పాల్గొనడం అదృష్టం గా భావిస్తున్నానని కొనియాడారు. చందానగర్ డివిజన్ కార్పొరేటర్ రెడ్డి మంజుల రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ ఉగాది రోజున పంచాంగ శ్రవణం, కవిసమ్మేళనం కార్యక్రమాలు తెలుగుతనం ఉట్టిపడేలా చేసిన శిష్ట కరణం కులానికి కృతజ్ఞతలు తెలిపారు. శిష్ట కరణ జాతీయ ఓబీసీ కమిటీ కన్వీనర్ డీవీ కృష్ణారావు మాట్లాడుతూ ఉగాది పండుగను దేశంలోని అన్ని ప్రాంతాలలో అన్ని రాష్ట్రాల్లో వివిధ పేర్లతో నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తున్న సంప్రదాయమని, ప్రతి వ్యక్తి తమ సంస్కృతి సంప్రదాయాలను గౌరవించుకోవాలని ఆయన అన్నారు .ఈ ఉగాది సంబరాల్లో భాగంగా ప్రముఖ జ్యోతిష శాస్త్ర పండితులు డాక్టర్ కె వీ ఎం పట్నాయక్ పంచాంగ పఠనం చేశారు. అనంతరం శిష్ట కరణ సామాజిక వర్గం కవులు తమ కవితా గానాలతో కనుల పండుగ గా నిర్వహించారు. శిష్టకరణ కవులు పీఆర్ ఎస్ ఎస్ ఎన్ మూర్తి, మోటూరి నారాయణరావు రావు తో పాటు అనేక కవి ప్రముఖులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర శిష్ట కరణ సంక్షేమ సంఘం నాయకులు కోశాధికారి యు. పార్వతీశ్వర రావు , ఆర్. శేషగిరి రావు, హరగోపాల్, పార్ధసారధి, డీవీ రమణ మూర్తి , ప్రకాశరావు, వెంకటేశ్వర రావు, శంకర్ పట్నాయక్, మురళి శర్మ, చందు ప్రసాద్, జయశ్రీ, శేషారత్నం, పద్మ , వెంకట రత్నం, ఆనందరావు పట్నాయక్, దుర్గా ప్రసాద్, శిష్ట కరణ లేఖ టీం సభ్యులు నర్సింహా రావు, నరేష్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

 

 

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here