నమస్తే శేరిలింగంపల్లి:తెలంగాణ రాష్ట్ర సగర మహిళా సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు అంబరాన్నంటాయి. నగరంలోని ట్యాంక్ బండ్ బతుకమ్మ ఘాట్ లో తెలంగాణ సగర మహిళా సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాలలో దాదాపు ఏడు వందల మంది సగర మహిళలు పాల్గొని ఆడి పాడారు. తెలంగాణ ఆటపాటలతో బతుకమ్మఘాట్ హోరెత్తింది. చిన్నపెద్ద, పేదధనిక తేడా లేకుండా సగర మహిళలు వందలాదిగా తరలివచ్చి సాయంత్రం బతుకమ్మ ఆటలాడారు.
తెలంగాణ సగర మహిళా సంఘం అధ్యక్షురాలు పెద్దబూది మహేశ్వరి సగర ఆధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర, రాష్ట్ర గౌరవాధ్యక్షులు ముత్యాల హరికిషన్ సగర, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరక్క సత్యం సగర, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ అధ్యక్షులు ఆర్.బి ఆంజనేయులు సగర, యాదాద్రి సగర అన్నదాన సత్రం వ్యవస్థాపక అధ్యక్షుడు గిన్నె భీమయ్యసగర, వరంగల్ సగర ధర్మకర్తల మండలి గౌరవాధ్యక్షులు సీతా బద్రయ్య సగర, ఆర్డీఓ శ్రీనివాస్ సగరలు హాజరయ్యారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయం ఉట్టిపడేలా ఈ బతుకమ్మ ఉత్సవాలు వైభవంగా సాగాయి.
హైదరాబాద్ మహా నగరం పరిధితో పాటు వరంగల్, రంగారెడ్డి, నల్గొండ, మెదక్, మేడ్చల్ ఇతర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు వందలాదిగా తరలివచ్చారు. మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాండ్ల స్రవంతి సగర, రాష్ట్ర కోశాధికారి తంగడపల్లి పల్లవి సగర, యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు పెద్దబూది సతీష్ సగర, ప్రధాన కార్యదర్శి మర్క సురేష్ సగర, కోశాధికారి సందుపట్ల రాము సగర, రాష్ట్ర సంఘం సంయుక్త కార్యదర్శులు కొండయ్య సగర, ధామోదరయ్య సగర, ప్రచార కార్యదర్శి మర్కు సతీష్ సగర, సీనియర్ నాయకులు ఉదయ్ సగర, అస్కాని శ్రీనివాస్ సగర, వైఎస్ఆర్ టిపి రాష్ట్ర నాయకురాలు అమృతకేసరి సగర, రాష్ట్ర మహిళా సంఘం ఉపాద్యక్షులు స్వప్న సగర, విజయలక్ష్మి సగర, సత్య సగర, అలవేలు సగర, చంద్రకళ సగర, సూర్యకళ సగర, జయమ్మ సగర, సరిత సగర, గ్రేటర్ హైదరాబాద్ సగర సంఘం అధ్యక్షులు మోడల రవి సగర, ప్రధాన కార్యదర్శి వెంకట్రాములు సగర, కోశాధికారి రామస్వామి సగర, గౌరవాధ్యక్షులు వెంకటస్వామి సగర, వరంగల్ జిల్లా అధ్యక్షులు పొట్లపల్లి సురేష్ సగర, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సూరంపల్లి కృష్ణ సగర, ప్రధాన కార్యదర్శి చింతల బాలు సగర, నల్గొండ జిల్లా అధ్యక్షులు సందుపట్ల లక్ష్మణ్ సగర, ప్రధాన కార్యదర్శి ఆలేటి శివప్రసాద్ సగర, మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి నర్సింహ్మ సగర, వరంగల్ సగర ట్రస్ట్ అధ్యక్షులు సీతాకమలాకర్ సగర, ప్రధాన కార్యదర్శి వడ్లకొండ కుమారస్వామి సగర, మహిళా సంఘం గౌరవ సలహాదారులు కుసుమమ్మ సగర, పద్మ నళిని సగర, మణిమంజరి సగర తదితరులు పాల్గొన్నారు.