నమస్తే శేరిలింగంపల్లి:మాదాపూర్ శిల్పారామంలో నిర్వహిస్తున్న ఆల్ ఇండియా సారీ మేళ మహిళలను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ మేళాలో చేనేత వస్త్రాలతో ప్రదర్శించిన స్టాల్స్‌ను మహిళలు సందర్శించి చేనేత ఉత్పత్తులను ఆసక్తిగా కొనుగోలు చేస్తున్నారు. కోట మహేశ్వరం, బనారస్, పోచంపల్లి, కుప్పడం, ఉప్పాడ, గద్వాల్, గొల్లబామ, చెందేరి, కలంకారీ తదితర కాటన్, పట్టు చీరలు ఈ స్టాల్స్ లో అందుబాటులో ఉంచారు. మెయిన్ లాన్ లో మహిళలు ఆటపాటలతో దాండియా ఆడుతూ బతుకమ్మ ఉత్సవాలను జరుపుకున్నారు హిమబిందు కనోజ్ శిష్య బృందం సరస్వతి స్తుతి ప్రదర్శించగా కూచిపూడి కళాకారిణి స్వాతి సోమనాధ్ శిష్య బృందం సౌండ్ ఆప్ సైలెన్స్ కూచిపూడి నృత్య రూపకాన్ని ప్రదర్శించారు.