చందాన‌గ‌ర్‌లో యువ‌తి అదృశ్యం

చందాన‌గ‌ర్‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కాలేజీకి వెళ్లి వ‌స్తాన‌ని చెప్పి ప‌నిచేస్తున్న ఇంటి నుంచి బ‌య‌ట‌కు వెళ్లిన ఓ యువ‌తి అదృశ్య‌మైన సంఘ‌ట‌న చందానగర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్ర‌కారం ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించి వివ‌రాలు ఈ విధంగా ఉన్నాయి. దిల్‌సుఖ్‌న‌గ‌ర్‌లోని శాలివాహ‌న న‌గ‌ర్‌కు చెందిన క‌స్న‌బోయిన రాజు మేన‌కోడ‌లు మ‌ట్టా ల‌క్ష్మీ ప్ర‌స‌న్న (20) చందాన‌గ‌ర్‌లోని అప‌ర్ణ‌హిల్ పార్క్‌లో బ్లాక్ బిలో ప్లాట్ నం.102లో నివాసం ఉండే కందుకూరి సుమ అనే మ‌హిళ వ‌ద్ద ప‌నిమ‌నిషిగా గ‌త ఏడాదిన్న‌ర నుంచి ప‌నిచేస్తూ అక్క‌డే నివాసం ఉంటోంది.

మ‌ట్టా ల‌క్ష్మీ ప్ర‌స‌న్న (ఫైల్‌)

కాగా న‌వంబ‌ర్ 28వ తేదీన ఉద‌యం 9 గంట‌ల‌కు ల‌క్ష్మీ ప్ర‌స‌న్న సికింద్రాబాద్‌లోని న‌ర్సింగ్ కాలేజీకి వెళ్లి వ‌స్తాన‌ని చెప్పి బ‌య‌ట‌కు వెళ్లింది. ఉద‌యం 10.30 గంట‌ల స‌మ‌యంలో తాను కాలేజీకి వెళ్ల‌లేద‌ని, త‌న ఫ్రెండ్ ఇంటికి వెళ్లాన‌ని తెలిపింది. దీంతో రాజు ఆమెను హెచ్చ‌రించాడు. ఈ క్ర‌మంలో 12.30 గంట‌ల స‌మ‌యంలో ఆమెకు కాల్ చేయ‌గా ఆమె ఫోన్ స్విచాఫ్ వ‌చ్చింది. అప్ప‌టి నుంచి ఆమె తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆమె కుటుంబ స‌భ్యులు అన్ని చోట్లా గాలించినా ఆమె ఆచూకీ తెలియ‌లేదు. ఈ క్ర‌మంలో వారు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌గా, వారు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here