మియాపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మ‌హ‌త్య

మియాపూర్‌‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): అనుమానాస్ప‌ద స్థితిలో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఉరి వేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. మియాపూర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకున్న ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసులు తెలిపిన ప్ర‌కారం వివ‌రాలు ఈ విధంగా ఉన్నాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా గుడివాడ‌కు చెందిన నాగ సాయి మణి దీపికకు, ర‌వికిర‌ణ్ అనే వ్య‌క్తికి 2016లో వివాహం అయింది. వీరికి ఇద్ద‌రు సంతానం. కాగా దీపిక గ‌చ్చిబౌలిలోని టీసీఎస్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిగా ప‌నిచేస్తోంది. మియాపూర్‌లోని గోపాల్‌న‌గ‌ర్‌లో భ‌ర్త‌, పిల్ల‌ల‌తో క‌లిసి ఉంటోంది. కాగా సోమ‌వారం ఆమె ఇంట్లో సీలింగ్‌కు ఉరి వేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఈ మేర‌కు స‌మాచారం అందుకున్న పోలీసులు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని దీపిక మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి త‌ర‌లించారు. ఆమె త‌ల్లిదండ్రులు ప్ర‌స్తుతం ఏపీ నుంచి వ‌స్తున్నార‌ని, వారు ఫిర్యాదు చేశాక కేసు న‌మోదు చేస్తామ‌ని పోలీసులు తెలిపారు. ఆమె ఆత్మ‌హ‌త్య‌కు గల కార‌ణాలు ఇంకా తెలియ‌రాలేద‌ని పోలీసులు తెలిపారు.

దీపిక మృత‌దేహం
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here