విద్యుత్ షాక్‌తో గుర్తుతెలియని వ్యక్తి మృతి

శేరిలింగంపల్లి, సెప్టెంబ‌ర్ 2 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విద్యుత్ షాక్ తగిలి ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. సిద్దిక్‌నగర్ రోడ్ నంబర్‌-10లోని ప్రభుత్వ పార్క్ వెనుక ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ వద్ద బుధవారం మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడి వయసు సుమారు 25 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు. అతను బ్రౌన్ రంగు షర్టు, గ్రీన్ రంగు జీన్స్ ప్యాంటు ధరించి ఉన్నట్లు వెల్లడించారు. మృతుడిని ఎవరైనా గుర్తించినట్లయితే మాదాపూర్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here