శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 21 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక హనుమాన్ దేవాలయంలో సోమవారం మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. యెల్లంకి రవీందర్ గౌడ్, యెల్లంకి శ్రీనివాస్ గౌడ్ సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు మహా అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. కార్యక్రమానికి మియాపూర్ గ్రామ పెద్దలు, యూత్ అసోసియేషన్ సభ్యులు, వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు, స్థానిక వ్యాపారవేత్తలు, పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. సేవా దృక్పథంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన యెల్లంకి సోదరులను స్థానికులు అభినందించారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజంలో స్ఫూర్తిని నింపుతాయని వారు పేర్కొన్నారు.







